రెండు కోట్ల మంది మహిళలను చంద్రబాబు మోసం చేశారు: వరుదు కల్యాణి

  • సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేవరకు పోరాటం కొనసాగుతుందన్న కల్యాణి
  • హామీలు నెరవేర్చడంలో సీఎం, డిప్యూటీ సీఎం విఫలమయ్యారని విమర్శ
  • ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయలేదని ఆరోపణ
కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి తీవ్ర విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, సూపర్ సిక్స్ హామీలను పూర్తిగా అమలు చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రెండేళ్లు గడిచినా అమలు చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ విఫలమయ్యారని ఆమె ఆరోపించారు. ముఖ్యంగా 'ఆడబిడ్డ నిధి’ పథకాన్ని సక్రమంగా అమలు చేయకపోవడం ద్వారా చంద్రబాబు రెండు కోట్ల మంది మహిళలను మోసం చేశారని విమర్శించారు.

తిరుపతిలో ఇటీవల నిర్వహించిన సభను విజయోత్సవ సభగా కాకుండా 'వెన్నుపోటు సభ'గా పిలవాలని ఆమె వ్యాఖ్యానించారు. ప్రతి కుటుంబంలోని అర్హులైన మహిళలకు ఆడబిడ్డ నిధి అందిస్తామని హామీ ఇచ్చినా, తొలి ఏడాదిలోనే మొదటి విడత కూడా విడుదల చేయలేదని ఆరోపించారు.

ఎన్నికల హామీల అమలుపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూటమి నాయకులపై ఉందని వరుడు కల్యాణి అన్నారు. సూపర్ సిక్స్ హామీలు పూర్తిగా అమలయ్యాయని ధైర్యంగా ప్రజల ముందుకు వచ్చి చెప్పాలని ఆమె సవాల్ విసిరారు. ప్రజలు ఇప్పటికే ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నలు వేయడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

Varudu Kalyani
Chandrababu Naidu
Aadabidda Nidhi scheme
Super Six promises
YSRCP vs TDP
Andhra Pradesh politics

More Telugu News